Wednesday 27 February 2013

దొమలు నుంచి రక్షణ

దొమలు కాటు

ఈ రోజుల లో దోమలు నుంచి రక్షణ్ కోసం రకరకాల (అల్ అవుట్ ,mosquito కోయిల్ ) బ్రాండ్స్ దొరుకుతున్నాయి .కాని ఎన్ని వాడినా దోమలు కుట్టేస్తాయి ఇంత దద్దురు కుడా అవుతుంది .పిల్లలు ని ఎక్కువగా కుట్టేస్తాయి  ఇంకా దద్దురు మూలం గా పిల్లలు ఎక్కువ గోకి గోకి పుండు లాగ చేసేసుకుంటారు.
 ఈ కింద చూపిన విధంగా తయ్యారుచేసి  వాడి చుడండి .ఈ ఆయిల్  దోమలు కుట్టిన చోట రాసుకుంటే త్వరగా దురద తగ్గి  దద్దుర్లు మానిపోతాయి .


ఒక టీ కప్ నువ్వుల నూనె

వేప ఆకుల పేస్టు

వేప ఆకులు తీసుకుని బాగా కడిగి ఆరబెట్టి కొంచం నీరు పోసి mixie లో పేస్టు చెయ్యండి . ఈ పేస్టు
ఒక రెండు స్పూన్లు తీసుకుని నువ్వుల నూనె లో వేసి కలిపి పొయ్య మీద పెట్టండి . చిన్న మంట పై స్టవ్ మీద పెట్టి పెట్టండి . కలుపుతూ ఉండండి అలా కాసేపు అయ్యాక వేప పేస్టు అంతా  నల్లగా అయ్యిపోయి రసం అంత నూనె లో కి ఇంకి పోతుంది నూనె అంత రంగు మారి ముదురు ఆకుపచ్చ రంగు అయ్యిపోతుంది. ఇప్పుడు నూనె పొయ్య మీదనుంచి దింపి వడగట్టండి .ఈ నూనె ఒక బాటిల్ లో పోసి ఉంచుకోండి . దోమ కాటు మీద ఈ నూనె రాయండి .
త్వరగా  దురద తగ్గుతుంది .


ఈ నూనె తయారు చేసి వాడి మీ కామెంట్స్ రాయండి

Friday 22 February 2013

appalu

అప్పాలు

1 కప్ బియ్య్పిండి 

1 కప్ బెల్లం

5 ఏలకలు

 1 spoon నెయ్యి

నూనె తగినంత

ఒక గిన్నె లో బెల్లం లో ఒక 1/2 కప్ నీరు పోసి స్టవ్ మీద పెట్టాలి.

 బెల్లం కరిగి నీటి లో కలిసి కొంచం పాకం లాగ వచ్చాక అన్దులో

 ఏలకలు పొడి చేసి కలపాలి తరవాత బియ్య్పిండి  వేసి ఉండ కట్టకుండా చక్కగా కలపాలి.

తరవాత స్పూన్ నెయ్యివేసి బాగా కలపాలి  . స్టవ్ ఆపెసి  గిన్నె కిందకి దించి

ఉంచాలి . చల్లారాక చిన్న చిన్నపూరీ లాగ చేసి నూనె లో ఎర్రగ వేయించి తీసుకోవాలి  .

ఇవి ఆంజనేయ స్వామికి నైవేద్యం గా పెట్టుకోవచ్చు

ఒక డబ్బా లో వేసి ఉంచితే నాలుగు రోజులు నిలవ ఉంటాయి .